వసంత పంచమి ఉత్సవాలకు భక్తులకు సంపూర్ణ సేవలు – వీడిసి ప్రతినిధులు
బాసర, (మనోరంజని తెలుగు టైమ్స్):
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వచ్చే నూతన సంవత్సరం జనవరి 23న నిర్వహించనున్న వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని రకాల సేవలు అందించేందుకు వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సిద్ధంగా ఉందని కమిటీ ప్రతినిధులు ఆలయ ఈవోకు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజన దేవిని
మర్యాదపూర్వకంగా కలిసిన వీడిసి సభ్యులు, ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈవో అంజన దేవి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న తీరును వీడిసి సభ్యులు ప్రశంసించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఈవోకు ఈ సందర్భంగా వీడిసి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.