గొర్రెల సంరక్షణకు నట్టల
నివారణ మందు వేయించాలి.
సారంగాపూర్ డిసెంబర్ 31 ( మనోరంజని తెలుగు టైమ్స్ )
నిర్మల్ జిల్లా, సారంగాపూర్:
గొర్రెలు, మేకల సంరక్షణకు నట్టల నివారణ మందులు వేయించడం అవసరమని పశువైద్యాధికారి నంద కుమార్ అన్నారు.వంజర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ లచ్చవ్వ రమేష్,పశు వైద్యాధికార తో కలిసి గొర్రెలకు నట్టల నివారణ మందును పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.గ్రామంలోని గొర్రెల పోషకులు గొర్రెలకు తప్పకుండా నట్టల మందు వేయించాలి గొర్రెల సీజన్ వ్యాధులు రాకుండా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మౌనిక నవీన్ , వైద్య సిబ్బంది ఎస్.ఓ దిలీఫ్,గోపాలమిత్ర సాగర్,రాజేందర్, లు పాల్గొన్నారు.