తాండ్ర(జి)లో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ.
సారంగాపూర్ డిసెంబర్ 31 ( మనోరంజని తెలుగు టైమ్స్ )
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని తాండ్ర(జి) గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ వెన్నెల నర్సయ్య
గొర్రెలకు,మేకలకు నట్టల నివారణ మందును పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందును ప్రతి గొర్రెల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి నంద కుమార్ 8 వందల గొర్రెలకు నట్టల నివారణ మందును వేశారు.ఈ కార్యక్రంలో ఉప సర్పంచ్ లక్ష్మీ గంగన్న, పశు వైద్య అసిస్టెంట్ మల్లికార్జున్,ఎస్.ఓ దీలిఫ్,గోపాల మిత్ర సాగర్,రాజేందర్, పశు పోషకులు పాల్గొన్నారు.