వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర తెలంగాణ తిరుపతిలో దాదాన్నగారి విఠల్ రావు ప్రత్యేక దర్శనం
నిజామాబాద్, డిసెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్):
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన గంగాస్థాన్‌లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల తాకిడి విశేషంగా కనిపించింది. ఈ సందర్భంగా దాదాన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి, స్వామివారిని శ్రద్ధాభక్తులతో దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్మన్ తదితర ప్రముఖులతో కలిసి వి.వి.ఐ.పి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర తిరుపతి ఆలయం భక్తులతో కిటకిటలాడగా, ఆలయ అధికారులు సక్రమ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు.