వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో పవార్ రామారావు పటేల్ దర్శనం

వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో పవార్ రామారావు పటేల్ దర్శనం

తిరుమల, డిసెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్):

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన శ్రీనివాసుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, సీనియర్ నాయకులు అశోక్ ముస్తాఫిరె, ఇతర నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment