ధనుర్మాస ముగింపు – ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన శైవాలయాలు

ధనుర్మాస ముగింపు – ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన శైవాలయాలు

ధనుర్మాస ముగింపు – ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన శైవాలయాలు
50వ డివిజన్‌లో పరిశుభ్రత కార్యక్రమాలు జోరుగా

మనోరంజని తెలుగు టైమ్స్, (నగరం): నిజామాబాద్ డిసెంబర్ 29
ధనుర్మాస ముగింపు – ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన శైవాలయాలు

ధనుర్మాసం ముగింపు మరియు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా నగరంలోని శైవాలయాలు భక్తుల రాకకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని 50వ డివిజన్‌లో ధనుర్మాస శోభ మరింత ఉట్టిపడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో, 50వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ (రాము) ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చకచకా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బట్టు రాఘవేందర్ (రాము) మాట్లాడుతూ, 50వ డివిజన్ పరిధిలో గతంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ధనుర్మాసం మనందరికీ ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పండుగ అని పేర్కొంటూ, రేపు ఉదయం భక్తులు అధిక సంఖ్యలో చక్రం గుడికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అందుకే చక్రం గుడి పరిసరాల్లో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
ఆలయ అర్చకులు నాని పంతులు, నాగరాజు పంతులు ఈ కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ సేవా కార్యక్రమాలకు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. వారి ఆశీర్వాదాలతో ప్రతి సంవత్సరం చక్రం గుడి ఆవరణతో పాటు 50వ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, గల్లీ సుందరీకరణ చేపడతామని బట్టు రాఘవేందర్ హామీ ఇచ్చారు. ఈ పరిశుభ్రత కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బంది పాల్గొని, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యం, ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందేలా ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment