నాగిరెడ్డిపేట్లో బీఆర్ఎస్ సర్పంచుల సన్మానం
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :
ఎల్లారెడ్డి నియోజకవర్గం, నాగిరెడ్డిపేట్ మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని మెజారిటీ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న అన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్దయ్య, ప్యాక్స్ మాజీ చైర్మన్ నర్సింలు, సాయిబాబా, రాజి రెడ్డి, బాబు రావు, పలువురు మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.