నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీగా డా. జలగం తిరుపతి రావు – దాదన్నగారి విఠల్ రావు సన్మానం

నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీగా డా. జలగం తిరుపతి రావు – దాదన్నగారి విఠల్ రావు సన్మానం

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్, డిసెంబర్ 27:

నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సెక్రటరీగా ఎన్నికైన డాక్టర్ జలగం తిరుపతి రావు ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు వారి స్వగృహానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ, డాక్టర్ జలగం తిరుపతి రావు ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సేవాభావంతో పనిచేసే నాయకత్వానికి ఇదొక గుర్తింపని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా లీగల్ అడ్వైసర్ దాదన్నగారి మధుసూదన్ రావు, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు, శ్రీ రాంచంద్రరావు తదితరులు పాల్గొని డాక్టర్ జలగం తిరుపతి రావు ను అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సజావుగా జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment