ఒక్క రూపాయితో అంత్యక్రియలు…

**ఒక్క రూపాయితో అంత్యక్రియలు…

మానవత్వానికి చిరునామాగా బూరుగుపల్లి సర్పంచ్**

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి

పేదరికం బ్రతికినంత కాలమే కాదు…
చివరి ప్రయాణంలో కూడా భారంగా మారుతున్న వేళ,
మానవత్వానికి అర్థం చెబుతూ బూరుగుపల్లి నూతన సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
లోకల్ సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే, గ్రామంలో ఎవరు మరణించినా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా కేవలం ఒక్క రూపాయితో అంత్యక్రియలు నిర్వహించేలా తీర్మానం చేశారు.
డబ్బుల్లేక చివరి వీడ్కోలు కూడా భారంగా మారకూడదన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది.
ఆర్భాటం కాదు… ఆలోచన
పదవి చేపట్టిన వెంటనే హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సామాన్యుడి బాధను తన బాధగా భావించారు కళ్యాణ్ కుమార్.
గ్రామంలో పేద కుటుంబాల్లో మరణం సంభవిస్తే దహన సంస్కారాలకు ఖర్చులు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి ఈ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.
గౌరవప్రదమైన ఆఖరి ప్రయాణం
“మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాడు…
పోయేటప్పుడు ఏమీ తీసుకుపోడు…
కానీ ఆ చివరి ప్రయాణం గౌరవంగా ఉండాలి” అన్న భావనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
సర్వత్రా ప్రశంసలు
రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదని, బాధ్యత అని నిరూపించిన ఈ చర్యపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
“రూపాయికే అంత్యక్రియలు” అనేది ఒక పథకం మాత్రమే కాదు…
అది ఒక కుటుంబానికి భరోసా, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
బూరుగుపల్లి గ్రామం నేడు కేవలం ఒక గ్రామం కాదు…
మానవత్వం పరిమళించే ఆదర్శ గ్రామంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment