కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు సీఐటీయూ నిరసన

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు సీఐటీయూ నిరసన

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు సీఐటీయూ నిరసన

నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నా కార్యక్రమం — కీసర మండలంలో ఆందోళన

మనోరంజని తెలుగు టైమ్స్‌, కీసర, డిసెంబర్ 26:
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు సీఐటీయూ నిరసన

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కీసర మండల పరిధిలో ఘనమైన నిరసన కార్యక్రమం జరిగింది. నాగారం సర్కిల్‌ ప్రాంతంలోని గోధుమకుంట, కరీంగూడా, రాంపల్లి–దాయరా మరియు దమ్మాయిగూడ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి, అనంతరం మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు మాట్లాడుతూ —
“కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనాన్ని ₹26,000లకు పెంచి అమలు చేయాలి. ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే, “జాతీయ స్థాయిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా కీసర మండలంలోని అనేక ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలు నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు చింతకింది అశోక్, నాగారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, దమ్మాయిగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, అలాగే గోధుమకుంట, కరీంగూడా, రాంపల్లి–దాయరా ప్రాంతాల మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment