కంకెట గ్రామానికి బస్సు ను నడపాలని రోడ్డు పై ఆందోళన.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 25
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని కంకెట గ్రామానికి ఆర్టీసీ బస్సును నడపాలని కోరుతూ గురువారం వైకుంఠ పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. ఇదివరకు విషయమై సంబంధిత అధికారులకు
విన్నవించన స్పందించలేదు
మా గ్రామ సమీపం నుండె నిర్మల్ నుండి గొల్లమడ గ్రామానికి బస్సు వెళుతున్న తమ గ్రామానికి రాకపోవడం తో వారు రోడ్డుపైకి వచ్చినట్లు గ్రామస్థులు వెల్లడించారు.దీంతో రాకపోకలకు ఇబ్బంది కలగడంతో సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి నేటి నుంచి రోజు బస్సు సర్వీసును ప్రారంభిస్తాం అని హామితో గ్రామస్థులు ధర్నా విరమించారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వర్,నారాయణ,భీమన్న,నర్సయ్య,లస్మన్న సుకుమార్ మహిళలు పాల్గొన్నారు.