అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రొద్దుటూరు, డిసెంబర్ 24 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రొద్దుటూరులో మానవత్వాన్ని ప్రతిబింబించే విధంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి సేవా దృక్పథాన్ని చాటుకుంది. స్థానిక అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వెన్నపూస రాములమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమ సంస్కారాల కోసం బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబాహన్‌ను సంప్రదించగా, వారు వెంటనే స్పందించి బుధవారం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ అధ్యక్షుడు సుబాహన్, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టి వెంకట లక్ష్మ్మ, ప్రసన్న కుమార్, సురేష్ పాల్, సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫౌండేషన్ సభ్యుల సేవా మనసును కొనియాడారు.
మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు క్రింది నంబర్లను సంప్రదించవచ్చు —
📞 82972 53484, 91822 44150

Join WhatsApp

Join Now

Leave a Comment