గొర్రెల పెంపకం దారులు నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 24
నిర్మల్ జిల్లా,సారంగాపూర్:
గొర్రెల పెంపకం దారులు నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి నంద కుమార్,గ్రామ సర్పంచులు బడి పోతన్న, సాయబ్ రావు లు అన్నారు.బుధవారం మండలంలోని కంకట, ధని గ్రామాల్లో సంయుక్తంగా కలసి మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా 1650 జీవాలకు ఉచిత నట్టల నివారణ మందును వేశారు.ఈ కార్యక్రంలో పశు వైద్య సిబ్బంది మల్లికార్జున్,దీలిఫ్ పశు పోషకులు పాల్గొన్నారు.