గోపాల్‌పేట్ నూతన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్‌కు ఘన సన్మానం

గోపాల్‌పేట్ నూతన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్‌కు ఘన సన్మానం

కామారెడ్డి, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి): డిసెంబర్ 15
గోపాల్‌పేట్ నూతన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్‌కు ఘన సన్మానం

కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్ నివాసంలో సోమవారం గోపాల్‌పేట్ గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్‌తో పాటు మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొని, సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—గ్రామ అభివృద్ధి కోసం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని, పాలనలో పారదర్శకతతో పాటు సమిష్టి కృషి అవసరమని సూచించారు. గోపాల్‌పేట్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment