కల్లూరు మేజర్ సర్పంచ్‌గా పెంటవర్ దశరథ్ ఘన విజయం

కల్లూరు మేజర్ సర్పంచ్‌గా పెంటవర్ దశరథ్ ఘన విజయం

407 ఓట్ల భారీ మెజార్టీతో బీఆర్‌ఎస్ యువ నాయకుడి గెలుపు

కుంటాల డిసెంబర్ 14 (మనోరంజని తెలుగు టైమ్స్):

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కుంటాల మండలంలోని కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు పెంటవర్ దశరథ్ ఘన విజయం సాధించారు. స్థానిక ఎన్నికల్లో ఆయన 407 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను కనబరిచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.అనునిత్యం ప్రజా సేవలో ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దశరథ్ ప్రజల మనస్సు గెలుచుకున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు ఓటర్లు మద్దతు పలికినట్లు స్థానికులు తెలిపారు. విజయం ఖరారైన వెంటనే గ్రామంలో సంబరాలు చోటు చేసుకోగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెంటవర్ దశరథ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సహకారంతో ముందుకు సాగుతానని నూతన సర్పంచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment