మీ సేవకై అవకాశం ఇవ్వాలి
ముధోల్, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
మీ సేవకై అవకాశం ఇవ్వాలని ముధోల్ పట్టణంలోని 12వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న విశాఖ సునీల్ జోంధలే ఓటర్లను కోరారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి, తమకు కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ—ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే ఐదేళ్ల పాటు దాని ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలబడి, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం సాధించే వ్యక్తిని ఎన్నుకోవడం ఓటర్ల చేతిలో ఉన్న సువర్ణావకాశమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే, ప్రజల ముందు ఉంచిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తారని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఆమెతో పాటు అనుబంధ సభ్యులు, మద్దతుదారులు తదితరులు పాల్గొన్నారు.