ఓటు హక్కు వినియోగించుకున్న వి. శోభారాణి – వి. సత్యనారాయణ గౌడ్ దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న వి. శోభారాణి – వి. సత్యనారాయణ గౌడ్ దంపతులు

ప్రజాస్వామ్య విలువలకు అండగా నిలవాలని పిలుపు

నిర్మల్/ఆదిలాబాద్ (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలకు అండగా నిలవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీటీసీ చైర్‌పర్సన్ వి. శోభారాణి, నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.సోన్ మండలం కడ్తాల్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివారం ఈ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్ట పరిధిలో పనిచేస్తూ, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పాటు వ్యక్తిగత సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయగల అభ్యర్థులను ఓటుతో ఎన్నుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం కంటే ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ 50 శాతం లోపే ఓటింగ్ నమోదవుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ఓటర్లను ఆదర్శంగా తీసుకుని పట్టణ ఓటర్లు కూడా కనీసం 85 శాతం కంటే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకునే దిశగా ముందుకు రావాలని వారు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment