సర్పంచ్ బరిలో రిటైర్డ్ దేశ సైనికుడు
గ్రామ స్వరాజ్యమే నా సంకల్పం : సంజీవ్‌రావు
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా, డిసెంబర్ 12
నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాను సంజీవ్‌రావు సర్పంచ్ పదవికి బరిలో దిగారు. తిమ్మాపూర్ గ్రామస్తులు లక్ష్మీ–సాయన్‌రావు దంపతులకు జన్మించిన సంజీవ్‌రావు 10వ తరగతి వరకు చదివి, 2002లో దేశ సేవకు అంకితమవుతూ భారత ఆర్మీలో చేరారు. 18 ఏళ్లు 3 రోజులు జవానుగా సేవలందించిన ఆయన 2020 జనవరి 2న గౌరవవంతంగా పదవీ విరమణ పొందారు.
దేశానికి సేవ చేసిన అనుభవంతో ఇప్పుడు గ్రామ స్వరాజ్య సాధన కోసం రాజకీయ రంగప్రవేశం చేస్తున్నానని సంజీవ్‌రావు తెలిపారు. గ్రామ యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, సమాజానికి ఉపయోగపడే మార్గంలో నడవాలి అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ప్రతి గ్రామానిదే… అందుకే సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.
గ్రామ సమస్యలను అర్ధం చేసుకొని వాటి పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని, విద్య, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని తిమ్మాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యమని సంజీవ్‌రావు అన్నారు.