ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలి : తహసీల్దార్ ఆడే కమల్ సింగ్
మనోరంజని తెలుగు టైమ్స్ – కుంటాల, డిసెంబర్ 12
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు ప్రతి గ్రామంలో అధికారులు, పోలీసు శాఖ సూచించిన నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు కుంటాల తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ సూచించారు. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
పోలింగ్ కేంద్రాల 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అక్కడ ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు.ప్రత్యేక నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.
నిషేధిత వస్తువులు,పోలింగ్ కేంద్రాల్లో క్రింది వస్తువులకు అనుమతి లేదు:మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్,ఇంకు బాటిల్స్ పెన్నులు,ఆయుధాలు, అగ్నికి సంబంధించిన ఇతర వస్తువులు
ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశం ఉంటుందని తెలిపారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టిన వారిపై పోలీసు నిఘా ఉంటుందని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎలాంటి సమస్యలు, అనుమానాస్పద విషయాలు తెలిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
విజయోత్సవ ర్యాలీలపై కఠిన ఆంక్షలు,ఎన్నికలు పూర్తయిన వెంటనే విజయోత్సవ ర్యాలీలు నిషేధం.సంబంధిత అధికారుల అనుమతితో నిర్దిష్ట రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలి.
టపాకాయలు పేల్చడం పూర్తిగా నిషేధం.
ప్రత్యేక బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ తెలిపారు—
సున్నితమైన గ్రామాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు.ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నట్టు.చెప్పారు.జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెండవ విడత ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
చివరిగా ప్రజలను ఉద్దేశించి—
“ప్రతి ఓటు విలువైనది. నియమాలు పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి” అని విజ్ఞప్తి చేశారు.