సరైన అభ్యర్థిని ఎన్నుకుని ఓటు విలువను పెంచాలి
12 వ వార్డు అభ్యర్థి విశాఖ సునీల్ జోంధలే
మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్: డిసెంబర్ 12
నిస్వార్థ,
పారదర్శక సరైన పాలకున్ని ఎన్నుకుని తమ ఓటు విలువను పెంచాలని 12 వ వార్డు సభ్యులు విశాఖ సునీల్ జోంధలే అభ్యర్థించారు. శుక్రవారం ప్రతి ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 వ వార్డు సభ్యులుగా తాము బరిలో ఉన్నామని ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు వేయాలని కోరారు.వార్డు మెంబరే కదానని ఎవరికేసిన ఏమి అనే అపోహనకు పోవద్దని సరైన వ్యక్తిని ఎన్నుకుని తమ ప్రతినిధిని ఎన్నుకోవాలని గుర్తు చేశారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే వ్యక్తిని,పరిష్కార మార్గకులను ఎన్నుకోవాలని తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తమను బలపరిచినట్లయితే తాము ఇప్పటికే ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని దీన్ని ప్రజలు గమనించాలని స్పష్టం చేశారు.ప్రశ్నించే గొంతు ఎవరో ప్రజలే తేల్చుకోవాలని ఇది ప్రజలకున్న మంచి అవకాశమని తెలియజేశారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి తప్పకుండా తమకు అండగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మహేందర్,నాగేష్,మహేష్,
రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.