ఇసన్నపల్లి కాలభైరవ ఆలయంలో బహుళ అష్టమి వైభవం
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ – ఇసన్నపల్లి, డిసెంబర్ 12
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల ఇసన్నపల్లి గ్రామంలో కాలభైరవ స్వామి దేవస్థానంలో బహుళ అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్త జనసంద్రంతో కళకళలాడింది.ఈ సందర్భం పవిత్రమైనదని, కాశీ విశ్వనాథ్ ఆలయంలో కూడా శుక్రవారం బ్రహ్మ వాస్తవాలు నిర్వహించడం ఆనవాయితీ అని పండితులు తెలిపారు. ఆలయంలో జరిగిన అష్టమి మహోత్సవం కన్నులపండువగా సాగింది.మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి ఆలయానికి విచ్చేసి స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకం, అర్చనల ద్వారా మోక్షాలు పొందారు. పూజ కార్యక్రమాల్లో పంతులు శ్రీనివాస్ శర్మ, వంశీ శర్మ నేతృత్వం వహించారు.గ్రామం మొత్తంలో భక్తి వాతావరణం నెలకొన్న ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు.