ప్రజాసేవకునికి పట్టం కట్టండి
– సర్పంచ్ అభ్యర్థి తాటివార్ గంగా – రమేష్
– ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి
మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్:12డిసెంబర్
నిరంతరం ప్రజల మనిషిగా ప్రజల కష్టాలే తన కష్టాలుగా ప్రజా సేవకునిగా సేవలందించిన తాటివార్ గంగా – రమేష్ ఫుట్ బాల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్ లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తాటివార్ గంగా – రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆశీస్సులతో తాను ముధోల్ సర్పంచ్ గా బరిలో పోటీ చేస్తున్నానని తెలిపారు. దీంతో గ్రామంలో ప్రధానంగా నీటి సమస్య తీర్చడానికి ఎజెండాగా చేసుకున్నానని అన్నారు. గ్రామంలోని ఉన్న సమస్యలను పరిష్కరించి సేవకునిగా పనిచేస్తానని దృడ సంకల్పంతో తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. మీ అమూల్యమైన ఓటును ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.