అభివృద్ధి జరగాలంటే రూలింగ్ పార్టీని గెలిపించండి
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 08
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ప్యారామూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఈసారి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామంలో రాజకీయ వేడి నెలకొంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్ద సాయన్న తమ తరఫున మాన్కూర్ వరలక్ష్మి ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచారు. గ్రామ ప్రజలను ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ— గ్రామ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే రూలింగ్ పార్టీ అభ్యర్థినే గెలిపించాలి” అని అభిప్రాయపడ్డారు. వరలక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ, గ్రామ ప్రజలు తమ అమూల్య ఓటు ఇచ్చి ఆమెను గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు అభ్యర్థించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని, ప్యారామూరును ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.