సారంగాపూర్ మాజీ ఎంపీటీసీ మళ్లీ హస్తం గూటికి

సారంగాపూర్ మాజీ ఎంపీటీసీ మళ్లీ హస్తం గూటికి

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 06
సారంగాపూర్ మాజీ ఎంపీటీసీ మళ్లీ హస్తం గూటికి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని సారంగాపూర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ సామల పద్మ, వీరయ్య, 9వ వార్డు సభ్యుడు దేవి సుధాకర్‌తో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. సారంగాపూర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పి వారికి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలతో కలిసికట్టు పనిచేసే విధానం నమ్మకాన్ని కలిగించిందని, అందుకే పార్టీ మార్గదర్శకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ్, సారంగాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లోజు నర్సయ్య, ఓలత్రి నారాయణ రెడ్డి, కోర్వ నవీన్ రెడ్డి, డీలర్ నారాయణ రెడ్డి, కండెల భూమన్న, దేవి ముత్యం తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment