డా. బి.ఆర్. అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు

డా. బి.ఆర్. అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు

మనోరంజని తెలుగు టైమ్స్ – నాగిరెడ్డి పేట, డిసెంబర్ 06

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, పూజ్యులు డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా నాగిరెడ్డి పేట మండలంలోని రామక్కపల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజి రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ గారి సేవలను స్మరించుకుంటూ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ—
“సమాజంలోని ప్రతి వర్గానికీ రాజ్యాంగ పరిరక్షణ కల్పించిన మహనీయుడిని స్మరించుకోవడం మా బాధ్యత. ఆయన చూపించిన సమానత్వం, న్యాయం, సాంఘిక న్యాయం మార్గంలో నడవాలి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజి ఉప సర్పంచ్ సుధాకర, జానీ, బాలూ, పర్వ రెడ్డి తదితర నాయకులు, అంబేడ్కర్ అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment