రాజురా గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి – ప్రజలకు హామీలు
మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం
లోకేశ్వరం మండలానికి చెందిన రాజురా గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
“గ్రామంలో ఐక్యతతో పాటు అభివృద్ధి చేశి చూపిస్తా. ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అందర్నీ కలుపుకుంటూ రాజురాను ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తాను” అని ఆయన అన్నారు.
రాజకీయాల్లోకి ఆశతో కాకుండా, మార్పు కోసమే వచ్చానని పేర్కొన్న ఆయన—
“ఒక్కసారి అవకాశం ఇస్తే… గ్రామం ఎలా మారుతుందో పని చేసి చూపిస్తా” అని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం, సేవాప్రవృత్తి ప్రధాన లక్ష్యాలేనని వెల్లడించారు.