మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులకు తొలి దశ ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో పకడ్బందీగా ప్రక్రియ
మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్, డిసెంబర్ 06
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించే అధికారుల తొలి దశ ర్యాండమైజేషన్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పకడ్బందీగా పూర్తి చేశారు. మండలాల వారీగా నిర్వహించిన ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన పిఓలు, ఓపిఓలు సహా సమృద్ధిగా సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 20 శాతం అదనపు సిబ్బందిని కూడా నియమించినట్టు వెల్లడించారు. దీనితో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అధికారుల కొరత తలెత్తదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.