పెండల్దరి గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం

పెండల్దరి గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 05

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పెండల్దరి గ్రామ పంచాయతీలో ఈసారి సర్పంచ్ పదవి ఎస్టీ మహిళ రిజర్వేషన్‌కు కేటాయించడంతో గ్రామ పెద్దలు ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సీడం షేక్ బాయి‌ను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. సీడం షేక్ బాయి కుమారుడు సీడం గంగారం‌కు దశాబ్దానికి పైగా రాజకీయ అనుభవం ఉంది. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన ఆయన గ్రామ అభివృద్ధికి కీలకంగా సేవలందించారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులు పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, హామీ ఇచ్చిన పనులన్నింటినీ పూర్తి చేయడానికి కృషి చేస్తామని సర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment