దని గ్రామ సర్పంచ్ బరిలో స్వతంత్ర అభ్యర్థి గాండ్ల వరుణ్
మనోరంజని తెలుగు టైమ్స్, సారంగాపూర్ – డిసెంబర్ 05
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ధని గ్రామపంచాయతీకి ఈసారి సాధారణ రిజర్వేషన్ కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగా గ్రామస్థుడు గాండ్ల వరుణ్ సర్పంచ్ పోటీలో రంగంలోకి దిగారు. రాజకీయాలలో చురుకుగా పనిచేస్తూ, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకున్న వరుణ్‌కు గ్రామంలో మంచి గుర్తింపు ఉంది.గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రజాసేవలో కొనసాగుతున్న అనుభవమే తనకు బలమని వరుణ్ తెలిపారు. సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామాభివృద్ధినే ప్రథమ ప్రాముఖ్యతగా తీసుకుని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని వరుణ్ హామీ ఇచ్చారు.