ప్యారమూర్ లో దత్త జయంతి వేడుకలు.

ప్యారమూర్ లో దత్త జయంతి వేడుకలు.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 04
ప్యారమూర్ లో దత్త జయంతి వేడుకలు.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలోని దత్త ఆశ్రమం లో దత్త జయంతి బ్రహ్మోత్స వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీశ్రీశ్రీ అవధూతానంద స్వామి మహారాజ్ సమాధి ఆరాధన మంగళ హారతి అనంతరం దత్త జననం పంచామృత అభిషేకం హారతి మంత్రపుషం సమర్పణ అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ, మహా అన్నదానం నిర్వహించారు.
ఈ వేడుకలకు అవధూత నంద స్వామి మహారాజ్ భక్తులు, మండలంలోని ఆయా గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు గ్రామ అభివృద్ది కమిటి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment