పడిపూజల్లో పాల్గొన్న మాజీ జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

పడిపూజల్లో పాల్గొన్న మాజీ జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ — మేడ్చల్, డిసెంబర్ 03

మేడ్చల్ జిల్లా కొంపల్లిలో బుధవారం జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజలు కళాత్మకంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడ్డాయి. అరుణ రెడ్డి–అన్నపూర్ణ దంపతుల ఆధ్యాత్మిక సత్సంకల్పంతో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారి సేవలో భాగమయ్యారు. భక్తులతో మాట్లాడుతూ—
“ప్రతి వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రత్యేక స్థానం ఉంది. మనసు నిర్మలంగా ఉండేందుకు, సద్గుణాలు పెంపొందించేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక పూజలు మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వెంకట్ రమణ రెడ్డి దంపతులు , భజనలు, అర్చి పూజలు, నైవేద్యాలు ఘనంగా నిర్వహించగా, స్వామి శరణం మంత్రోచ్ఛరణలతో పరిసరాలు మారుమ్రోగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment