స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్
మనోరంజని తెలుగు టైమ్స్ – హైదరాబాద్, నవంబర్ 26
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై వివాదం మరింత ముదురుతోంది. జీవో 46 నిబంధనలను అతిక్రమిస్తూ బీసీ రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు 17 శాతం రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రభుత్వం జీవో 46 ను ఉల్లంఘించి రిజర్వేషన్లు కేటాయించిందని పిటిషనర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలోని 613 గ్రామ పంచాయతీలలో కేవలం 117 మాత్రమే బీసీ వర్గాలకు కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది, పిటిషనర్ న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు, విచారణను రేపటికి వాయిదా వేసింది.