ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంచుకోవాలి : ఎన్‌హెచ్‌ఆర్సీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర
నిజామాబాద్ మనోరంజని తెలుగు టైమ్స్ ఇందూర్, నవంబర్ 26 :
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ మరియు న్యాయవాద పరిషత్ ఇందూర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎన్‌హెచ్‌ఆర్సీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర—
భారత రాజ్యాంగం 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి పౌరుడు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను తెలుసుకోవడం అత్యంత అవసరం అని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సంసిద్ధతతో ముందుకు రావాలని, రాజ్యాంగం అందించిన హక్కులు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. నవంబర్ 26ను న్యాయవాదుల సమక్షంలో రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని ధర్మేంద్ర తెలిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సముద్రాల మధు, న్యాయవాద పరిషత్ ఇందూర్ సభ్యులు కృష్ణ, అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.