పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల — గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభం

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల — గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభం

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల — గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభం

మనోరంజని తెలుగు టైమ్స్ — హైదరాబాద్ నవంబర్ 25

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో పచ్చని పల్లెల్లో ఎన్నికల సందడి మొదలై, స్థానిక నాయకులు, యువత, కీలక పెద్దలు చర్చల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ — డిసెంబర్ 11, రెండో విడత — డిసెంబర్ 14
మూడో విడత — డిసెంబర్ 17
ఓటింగ్ జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 31 జిల్లాలలోని 12,733 గ్రామ పంచాయతీలకు, అలాగే 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో పలుచోట్ల సర్పంచ్ బరిలో నిలవాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి
అభ్యర్థులు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ, కుటుంబ పెద్దలు, యువతతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఎవరెవరిని బరిలో నిలపాలి, ఏ గ్రామంలో ఎలా వ్యూహం వేసుకోవాలి అనే అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. స్థానిక రాజకీయాలకు ఇది కీలక సమయంగా మారింది. గ్రామాల్లో ప్రణాళికలు వేడెక్కుతున్నాయి
సర్పంచ్ అభ్యర్థులు తమ బలగాన్ని సమీకరించుకుంటూ, ఓటర్లను కలుసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. పల్లెల్లో ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Join WhatsApp

Join Now

Leave a Comment