శివాజీ విగ్రహంపై వానరం.. ప్రయాణికులలో ఆసక్తి
మనోరంజని తెలుగు టైమ్స్ బాసర, నవంబర్ 24:
బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని శివాజీ చౌక్‌లో అరుదైన దృశ్యం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, యోధ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంలోని అశ్వంపై ఒక వానరం కూర్చుని కనిపించడంతో అక్కడికెళ్లిన ప్రజలు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు.
నిజామాబాద్–బైంసా ప్రధానరహదారి గుండా ప్రయాణిస్తున్న పలువురు ఆ దృశ్యాన్ని గమనించి ఆగి మొబైళ్లలో చిత్రాలు, వీడియోలు బంధించారు.
ఈ అరుదైన క్షణం సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ అయి చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల వ్యాఖ్యల్లో—
“వానరం అశ్వంపై కూర్చున్న తీరు ‘నేను నీకు రక్ష… నువ్వు నాకు రక్ష… మనం సమాజానికి రక్ష’ అన్నట్లుగా అనిపించింది” అని పలువురు పేర్కొన్నారు.
ఫోటో: బలగం శైలేష్, బాసర 📸