వివాహ మహోత్సవానికి హాజరైన మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ – నాగిరెడ్డిపేట, నవంబర్ 23
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన వివాహ మహోత్సవం ఎంతో ఆనందంగా జరిగింది. అకీడి వెంకటలక్ష్మి, తిరుపతి రెడ్డి ల ఏకైక పుత్రిక హారిక–భూపాల్ రెడ్డి వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మాజీ జడ్పిటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన మనోహర్ రెడ్డి, వారి దాంపత్య జీవితం నూరేళ్లు ఆనందసుఖాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.