రక్తదానం ప్రాణదానమే… ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ సేవా స్పూర్తి
మనోరంజని తెలుగు టైమ్స్ — ప్రొద్దుటూరు, నవంబర్ 23:
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమ్మ అనే గర్భిణీ మహిళకు రక్తహీనత కారణంగా O+ పాజిటివ్ రక్తం అత్యవసరం అయింది. విషయం తెలుసుకున్న వెంటనే మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు స్పందించి, రక్త దాతను అందుబాటులోకి తేవడంలో ముందడుగు వేశారు. ఫౌండేషన్ సభ్యుడు కిరణ్ తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని O+ రక్తదానం చేయడంతో గర్భిణీ నాగమ్మకు కొత్త ఆరుగును రప్పించినట్టు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంలో ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ—
“రక్తదానం అంటే ప్రాణదానం… ఒక్కొకరి సహాయం ఒక కుటుంబాన్ని కాపాడుతుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కృపా అగ్ని షారోన్ ట్రస్ట్‌కు చెందిన సుమన్ బాబు, ప్రసన్న కుమార్, పాపిశెట్టి వెంకట లక్షుమ్మ, మైఖేల్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రక్త దాత కిరణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహాయం కోసం సంప్రదించవలసిన నంబర్లు:
📞 82972 53484
📞 91822 44150
సేవ చేసే చేతులు దేవుడి చేతులవంటివి… రక్తదాతలందరికీ వందనం.