ప్రాణం కోసం విలపిస్తున్న కుటుంబం
AB+ లివర్ డోనర్ అత్యవసరం
మనోరంజని తెలుగు టైమ్స్ — భైంసా , నవంబర్ 23
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం గ్రామానికి చెందిన దండేకర్ సాయినాథ్ (రక్త గ్రూప్: AB+) తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర పరిస్థితుల్లో లివర్ డోనర్ అవసరం ఉందని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పేద కుటుంబం చెందిన సాయినాథ్కు ఇప్పటి వరకు జరిగిన వైద్య ఖర్చులు భరించలేని స్థితికి చేరుకున్నట్లు వారూ పేర్కొన్నారు. “ఈ సమయంలో ఎవరి సహాయం అయినా ఒక ప్రాణాన్ని కాపాడగలదు” అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై ప్రజల్ని కోరుతున్నారు.
AB+ రక్త గ్రూప్ కలిగిన దాతలు ముందుకు రావాలని పిలుపు
లివర్ దానం చేయగలిగిన వారు లేదా సంబంధిత సమాచారం తెలిసిన వారు వెంటనే సహాయం చేయాలని స్థానికులు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
సంప్రదించాల్సిన నంబర్
📞 97013 93826
“ఒక ప్రాణం నిలబెట్టడమే కాదు… ఒక కుటుంబాన్ని నిలబెట్టడమే” అంటూ స్వచ్ఛంద సంస్థలు రక్తదాతలు, అవయవదాతలు ముందుకు రావాలని కోరుతున్నాయి.
రండి… నిండు ప్రాణ దాతలు అవ్వండి.