రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలలో జామ్ గురుకుల విద్యార్థినిల ప్రతిభ
కన్సోలేషన్ ప్రైజ్ సాధించిన వైష్ణవి – పాల్గొని మెప్పించిన జోషిక
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్, నవంబర్ 21:
విద్యుత్ మరియు ఇంధన వనరుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యుత్, ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జామ్ విద్యార్థినులు ప్రతిభ చాటారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన విద్యార్థినులు డి. వైష్ణవి, కె. జోషిక నవంబర్ 21న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వైష్ణవి ₹7,500 కన్సోలేషన్ ప్రైజ్ గెలుచుకుంది. వారి విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ బి. సంగీత, ఉపాధ్యాయులు స్వరూప, స్వప్న శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.