రైతులపై కేసులు బనాయించడం సబబు కాదు: మనోహర్ రెడ్డి
కేసులు ఉపసంహరించాలంటూ బీఆర్ఎస్ డిమాండ్
మనోరంజని తెలుగు టైమ్స్ కామారెడ్డి: నవంబర్ 21
రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేయడానికి వెళ్లిన రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, అక్రమ కేసులు నమోదు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మాజీ జడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి అన్నారు. యాసంగి సన్నం వడ్డలకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వడ్ల కొనుగోలు త్వరితగతిన చేపట్టాలని కోరుతూ రైతులు ప్రశాంతంగా వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్లారని, అయితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు బనాయించడం అన్నదాతల అవమానమని ఆయన మండిపడ్డారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసులు ఉపసంహరించకపోతే, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంటుందని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.