*ఫార్ములా ఈ కార్ రేసులో నన్ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేడు: మాజీ మంత్రి కేటీఆర్!*
*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి* హైదరాబాద్:నవంబర్ 21
ఫార్ములా-ఈ కార్ కేసులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి,కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేటీఆర్ స్పం దించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చేసుకోనివ్వండి. నేను తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా నేను రెడీ అయ్యా. ఇంతకు మించి చెప్పేదేం లేదు. అయినా, సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు.. నా అరెస్టు జరగదు. ఆ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవ హారంపై మాట్లాడుతూ.. దానం నాగేంద్రతో రాజీనామా చేయించి.. కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు. అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని రాజీనామా చేపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తు న్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయని కేటీఆర్ అన్నారు. అలాగే హైదరాబాదులో అతిపెద్ద భారీ భూ కుంభ కోణం జరుగుతుంది, 9,300 ఎకరాల కుంభ కోణం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం చేస్తుంది. మొన్న జరిగిన రేవంత్ రెడ్డి, కేబినె ట్ భేటీలో 5 లక్షల కోట్ల ఆస్తులను కొట్టే సేందుకు తెరలేపిందన్నారు.