రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని రేవంత్‌పై విఠల్‌రావు విమర్శ
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్: ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘ఈ-కారం పోటీ’తో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీ వల్ల రాష్ట్ర గౌరవానికి భంగం కలిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన…
రేవంత్ రెడ్డి ‘దివర్షన్ పాలిటిక్స్’ కి పాల్పడుతున్నారని ఆరోపించారు. “ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ఈ రాజకీయ నాటకాలు వేస్తున్నారు. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాథమిక–తుది నివేదికలు తీసుకొచ్చారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గరపడుతుండగా, మరోసారి ‘ఈ కార్ కేసు’ను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారు” అని విఠల్‌రావు విమర్శించారు. కాళేశ్వరం, ఈ-కార్ ప్రాజెక్టులలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేసిన ఆయన…
“రాజకీయ కక్ష్యతో కుట్రపూరిత చర్యలు చేపడుతున్న రేవంత్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి అవమానం. రాష్ట్ర అభివృద్ధిని మాయమాటలతో దారి మళ్లించే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు” అని హెచ్చరించారు.