బి ఆర్ఎస్ పోరు… దిగొచ్చిన సర్కార్
రైతుల పక్షాన బలంగా నిలిచిన బి ఆర్ఎస్: విఠల్ రావు
మనోరంజని తెలుగు టైమ్స్, నిజామాబాద్ — నవంబర్ 19
పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బి ఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ జడ్పీ చైర్మన్, బి ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్ రావు అన్నారు. మంగళవారం బి ఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పత్తి రైతులతో నిర్వహించిన ‘రైతుల ముఖాముఖి’ కార్యక్రమం ప్రభావంతో ప్రభుత్వం చలించిందని, వెంటనే జిన్నింగ్ మిల్లులతో చర్చలు జరిపి పత్తి కొనుగోలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన విఠల్ రావు మాట్లాడుతూ— “రైతుల నడుమ నిలబడి వారి గోసలు వినేది, వారి కోసం పోరాడేది ఏ పార్టీ ఉందంటే అది బి ఆర్ఎస్ మాత్రమే. రైతులు పలువురి వద్ద తిరగాల్సిన పరిస్థితి రాకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావడం మా పోరాట ఫలితం.” అని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం సాధించేందుకు బి ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.