సంస్కారంతో కూడిన విద్య… సంస్కార్ స్కూల్ శుభపరిణామం

  1. సంస్కారంతో కూడిన విద్య… సంస్కార్ స్కూల్ శుభపరిణామం

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా, నవంబర్ 19:

సంస్కారంతో కూడిన విద్య… సంస్కార్ స్కూల్ శుభపరిణామం

ఆధునిక యుగంలో వేగవంతమైన జీవన శైలిలో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ… పాఠశాల విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ బోధించడం అభినందనీయమని నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు అభిప్రాయపడ్డారు.

బుధవారం భైంసాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో
తెలంగాణ మాజీ జడ్పీటీసీ సభ్యుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన సంస్కార్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల సంప్రదాయ సన్మానాలతో స్వాగతం పలికారు.

విఠల్‌రావు మాట్లాడుతూ-
“విద్యతో పాటు సంస్కారం అందించడం సంస్కార్ స్కూల్ ప్రత్యేకత.
ఇక్కడి విద్యార్థుల్లో కనిపించే క్రమశిక్షణ, విలువల ఆధారిత బోధన ఆదర్శప్రాయమైనది” అని ప్రశంసించారు.

పాఠశాల కరస్పాండెంట్ ప్రకాశ్ పటేల్తో మీకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన, పాఠశాలలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని అభినందించారు. అనంతరం హాజరైన శాలువా కప్పి సన్మానించారు. ఇటీవల ఉత్తమ అవార్డు అందుకున్న కరస్పాండెంట్ ప్రకాశ్ పటేల్‌ను ప్రత్యేకంగా అభినందించారు… మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

­సంస్కారంతో కూడిన విద్య… సంస్కార్ స్కూల్ శుభపరిణామం

తరువాత తరగతి గదులను పరిశీలించిన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, మనోరంజని తెలుగు టైమ్స్ ఎడిటర్ సూర్యవంశీ మాధవరావు పటేల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment