పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

మనోరంజని తెలుగు టైమ్స్ , బాల్కొండ ప్రతినిధి నవంబర్ 16

పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

ఈ రోజుల్లో మానవ సంబంధాలు మసకబారుతున్నాయి. స్వార్థాలు, డబ్బు బంధాలు పెరుగుతున్నాయి. రక్త బంధాలే దూరమవుతున్న వేళ… కుటుంబ సమేతంగా ఒకచోట చేరి బంధాలను బలపర్చుకోవడం, ప్రేమను పంచుకోవడం, ఆప్యాయతను పెంపొందించుకోవడం ఎంత అవసరమో చెప్పకనే చెబుతోంది పాలేపు వంశ పరివారం ఆత్మీయ కలయిక.

పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

ప్రకృతి ఒడిలో ఆత్మీయ సమాగమం

పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం, కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన పాలేపు వంశికులు ఆదివారం రోజున గ్రామ శివారులోని శుక్రవారం దేవీ చెట్టు వద్ద అందమైన ప్రకృతి మధ్యలో ప్రత్యేకంగా ప్రకృతి విడిది ఏర్పాటు చేసుకున్నారు.

పాలేపు పరివారం వారి ‘ప్రకృతి విడిది’ – కుటుంబ బాంధవ్యాలకు నూతన దిశ

పరివారంలోని మహిళలు, పురుషులు, యువత, పిల్లలు—అందరూ ఏకమై వంటవార్పులు చేసి, సహపంక్తి భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపారు.

WHATSA~2

సాంప్రదాయ శోభ – బంధాల గొప్పదనం

మహిళలంతా ఏకరూప చీరలు ధరించి, వదినా–మరదళ్ల గాజులు వేసుకుంటూ ఆప్యాయత పంచుకున్నారు. నవ్వులు, మాటలు, అనుబంధాలు—అన్నీ కలగలిపి నిజమైన కుటుంబ వాతావరణాన్ని సృష్టించాయి.

WHATSA~1

భోజనం అనంతరం యువత – పెద్దలు అందరూ చెడుగుడు, సంప్రదాయ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలతో మురిసిపోయారు. “పరివారమంటే ఇదే… ఇలాగే ఉండాలి…” అనిపించేలా ఈ కలియిక సాగింది.

సామాజిక సందేశం – మానవ జీవన సరళి

తరాలు మారుతున్నా… జీవన శైలి వేగం పెరిగినా… కుటుంబం ఇచ్చే మానసిక శాంతి, బంధాలు ఇచ్చే బలం ఎవరూ భర్తీ చేయలేవని పాలేపు పరివారం చూపించింది.

సాంప్రదాయం, ఆధ్యాత్మికత, బంధుత్వం, అనుబంధాలకు నిలువు దర్పణంలా నిలిచిన ఈ ప్రకృతి విడిది, గ్రామస్థులకు, యువతకు ఒక మంచి సందేశాన్నిచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment