విద్యా అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

విద్యా అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

మనోరంజని తెలుగు టైమ్స్ బైంసా ప్రతినిధి నవంబర్ 15

విద్యా అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

విద్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తాను కట్టుబడి ఉన్నానని బైంసా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. బైంసా మండలంలోని వానలుపాడ్ గ్రామంలో జడ్పీ హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల ద్వారా రూ.12 లక్షల వ్యయంతో భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెంపు కోసం గ్రామస్తులు సహకరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాఠశాలలకు కావలసిన అదనపు గదుల కోసం నిధులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పాఠశాల బలోపేతానికి గ్రామస్తులు ముందుకు రావాలని కోరారు. “నేనే ఒక రైతు బిడ్డను… ఈ స్థాయికి రావడానికి విద్యే తోడ్పడింది. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం. ఉపాధ్యాయులు మరింత నాణ్యమైన బోధనకు కృషి చేయాలి. తల్లిదండ్రులు, గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దు” అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావ్ పటేల్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో నీరజ్, ఎంపీఓ జాదవ్ ప్రదీప్, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, గౌర శ్రీనివాస్, గణేష్ పటేల్, బైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, స్థానిక నాయకులు చందర్ పటేల్, సాయిరెడ్డి, సీనియర్ అడ్వకేట్ గంగాధర్, మాజీ సర్పంచులు రాము, ముత్యం రెడ్డి, బీజేపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment