తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం, పవర్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ తరఫున సియాసత్ విలేఖరి అజర్‌కు ఘన సన్మానం

తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం, పవర్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ తరఫున సియాసత్ విలేఖరి అజర్‌కు ఘన సన్మానం

మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 14

నిర్మల్ జిల్లా సియాసత్ విలేఖరి అజర్ తెలంగాణ ప్రభుత్వ ఉర్దూ అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీత అజర్‌ను తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షుడు షేక్ ముజాహిద్ పూల శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవర్ ఎలక్ట్రిషన్ వర్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు మొయిజ్, జలీల్ కూడా అజర్‌ను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ముజాహిద్, అబ్దుల్ సాజీద్, ముత్యం రెడ్డి, అర్షద్, ఇమ్రాన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment