విద్యార్థులకు మార్గదర్శకుడైన శ్రీహరికి ‘జీవన సాఫల్య పురస్కారం’
మనోరంజని తెలుగు టైమ్స్ – నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 13:
విద్యార్థులలో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తూ, వారికి నైతిక విలువలు, సంస్కార బోధన అందిస్తున్న నగరానికి చెందిన తిరునగరి శ్రీహరికి ‘జీవన సాఫల్య పురస్కారం’ లభించింది. తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, సమాఖ్య అధినేత చంద్రశేఖర్ స్వయంగా శ్రీహరికి ఈ పురస్కారాన్ని అందజేశారు.శ్రీహరి విద్యార్థులలో మద్యపానం, చరవాణి వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండే చైతన్యాన్ని కలిగిస్తూ, చదువుతో పాటు నడవడిక, సంస్కారం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ పలు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీహరి అన్నారు –
“ఇప్పటివరకు ఎందరో విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేశాను. ఈ పురస్కారం నాకు మరింత ప్రేరణనిస్తోంది. ఇంకా ఎక్కువమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరునగరి శ్రీహరి దంపతులు, సమాఖ్య సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.