డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా పీఆర్వో వంశీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి పవన్

డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా పీఆర్వో వంశీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి పవన్

 

  • తెలంగాణ డీజీపీ డా. శివధర్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా సర్టిఫికేట్ సత్కారం

  • హైదరాబాదులో మూడు రోజుల పీఆర్వో ప్రొఫెషనల్ ట్రైనింగ్ విజయవంతం

  • ప్రజా విశ్వాసానికి వంతెనలుగా నిలవాలని డీజీపీ సూచనలు

  • నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రోత్సాహం మాకు ప్రేరణ అని పీఆర్వో వంశీ, పవన్ వ్యాఖ్య



హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల పీఆర్వో ప్రొఫెషనల్ ట్రైనింగ్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పీఆర్వో నరిమెట్ల వంశీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి రామ్ పవన్ కుమార్ లు తెలంగాణ డీజీపీ డా. శివధర్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. డీజీపీ పీఆర్వోలను ప్రజలతో పోలీస్ శాఖను కలిపే వంతెనలుగా ఉండాలని సూచించారు.



హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ పీఆర్వోల ప్రొఫెషనల్ ట్రైనింగ్ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పీఆర్వో నరిమెట్ల వంశీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి రామ్ పవన్ కుమార్ లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. శివధర్ రెడ్డి ఐపీఎస్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ  మాట్లాడుతూ, “పీఆర్వోలు ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలుగా ఉండాలి. పోలీస్ శాఖ యొక్క నిజమైన ప్రతిఛాయను సమాజానికి చేరవేయడం, సమయానుకూలంగా సరైన సమాచారాన్ని అందించడం ద్వారానే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుంది. సోషల్ మీడియా యుగంలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అత్యంత కీలకం” అని పేర్కొన్నారు.

అలాగే, పీఆర్వోలు శిక్షణలో పొందిన జ్ఞానం, నైపుణ్యాలను వినియోగించి పోలీస్–ప్రజల అనుబంధాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నరిమెట్ల వంశీ, రామ్ పవన్ కుమార్ మాట్లాడుతూ, “ఈ శిక్షణలో మేము ఎంతో నేర్చుకున్నాము. డీజీపీ గారి సూచనలను పాటిస్తూ, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించే విధంగా రచనలు కొనసాగిస్తాము. మా జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల ఐపీఎస్ గారి ప్రోత్సాహం మాకు ప్రేరణ” అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment