నూతన వధూవరులకు “ధమ్మపదం” బహుకరణ

నూతన వధూవరులకు “ధమ్మపదం” బహుకరణ

నూతన వధూవరులకు “ధమ్మపదం” బహుకరణ

 

  • నూతన దంపతులకు అంబేడ్కరైట్లు అందజేసిన “ధమ్మపదం” పుస్తకం

  • బౌద్ధ తత్త్వవేత్త బంతే ధమ్మ రఖ్ఖిత రచన

  • జీవన విలువలు, మానవతా మార్గం ప్రతిబింబించిన పుస్తక బహుమతి



నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో జరిగిన కూన అజయ్–పూజ (జగ్గసాగర్) వివాహ వేడుకలో అంబేడ్కరైట్లు నూతన దంపతులకు బంతే ధమ్మ రఖ్ఖిత రచించిన “ధమ్మపదం” పుస్తకాన్ని బహుకరించారు. బౌద్ధ విలువలు, మానవతా సందేశాలు కలిగిన ఈ పుస్తకాన్ని చదివి ఆచరించాలని డిఎస్ఎస్ నేతలు సూచించారు.



నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గురువారం మధ్యాహ్నం వరుడు కూన అజయ్, వధువు పూజ (జగ్గసాగర్)ల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత తెలుగు బౌద్ధ తత్త్వవేత్త, ప్రత్యక్ష బౌద్ధ గురువు, మోక్షానంద బుద్ధ విహార్ వ్యవస్థాపకులు బంతే ధమ్మ రఖ్ఖిత రచించిన “ధమ్మపదం” అనే గొప్ప పుస్తకాన్ని అంబేడ్కరైట్లు నూతన దంపతులకు బహుకరించారు.

డిఎస్ఎస్ నేతలు ఈ పుస్తకంలోని తథాగత గౌతమ బుద్ధ సూక్తులు, మానవీయ విలువలు, సద్జీవన మార్గం గురించి వివరించి, దంపతులు దీనిని చదివి ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ పుస్తక బహుకరణ వెనుక నూతన దంపతుల్లో సుఖం, శాంతి, అభివృద్ధి వర్ధిల్లాలన్న సంకల్పం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ దళిత విప్లవ పోరాట నాయకుడు దివంగత అరె సురేందర్ కుమారుడు అరె అరుణ్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అంగుళి మాలజీ, సిరికొండ కార్తీక్, డిఎస్ఎస్ నేత జాంభవ చమార్, కాన్షిరాం మాలజీ, వరుని తల్లీ కూన సత్తాక్క, కరెక్క, మమత మాల, మామిడి రాజశేఖర్, పలిగిరి చరణ్, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment